నిర్ణీత గడువులోగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-09-14T22:07:36+05:30
ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. దగదర్తి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లాకలెక్టర్, వివిధశాఖల అధికారులు
జిల్లా కలెక్టరు
దగదర్తి(కావలి),సెప్టెంబరు14: ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. దగదర్తి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లాకలెక్టర్, వివిధశాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే, తమకు తెలియచేయాలని అర్జీదారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మొత్తం 110 అర్జీలు వచ్చాయని, వాటిలో ఎక్కువగా రెవెన్యూ, భూముల సర్వే, డీకేటీ పట్టాలు, సదరన్ క్యాంపులు, పంచాయతీల్లో దారి సమస్యలు, శ్మశాన భూముల సమస్యలపై వచ్చినట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు ఎవరూ కార్యక్రమానికి హాజరుకాలేదు. దగదర్తి మండలంలో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీతగడువులోగా పరిష్కరించాలన్నారు. కాగా తనకు పింఛన్ రావడంలేదని ఉలవపాళ్లకు చెందిన సులోచనమ్మ అనే వృద్ధురాలు ప్లకార్డుతో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శీనా నాయక్, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో సుస్మితరెడ్డి, డ్వామా పీడీ వెంకట్రావు, డీఆర్‌డీఏ పీడీ సాంబశివరెడ్డి, ఏడీ సర్వే హనుమాన్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, డీఎంహెచ్‌వో పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
-------------
Updated Date - 2023-09-14T22:07:36+05:30 IST