ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా

ABN, First Publish Date - 2023-07-02T22:33:19+05:30

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, జూలై 2 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. అల్లూరులోని విష్ణువర్ధన్‌రెడ్డి నివాసంలో ఆయన వర్గీయులు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఫోను ద్వారా మాట్లాడారు. అరుణాచలం యాత్రలో కాళ్లకు చిన్నపాటి గాయమై విశ్రాంతి తీసుకుంటున్నానని, దీనిని ఇతర పార్టీల నాయకులు వక్రీకరించి తాను ఇక రాజకీయాలకు దూరమైపోయానని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. ఇది మంచి విధానం కాదని ఖండించారు. విష్ణు శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా తనకు ఘనస్వాగతం పలికారో తెలుసుకోవాలన్నారు. పార్టీలు కాకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. త్వరలో తాను ప్రజాబాట పట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు అనంతరాజు బాలకృష్ణంరాజు, యరటపల్లి శేఖర్‌రెడ్డి, గోసల గోపాల్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, కోడూరు మురళి, గోపి, బిజ్జం వేణుగోపాల్‌రెడ్డి, సురేష్‌, ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-02T22:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising