ఇళ్ల నిర్మాణాలు చేపట్టండి
ABN, First Publish Date - 2023-05-02T21:55:55+05:30
మండలంలో ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్ తెలిపారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలో 27 లేఅవుట్లలో 953 మంది లబ్ధిదారులు ఉన్నారని, వీరంతా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయగిరి-3 సచివాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది నూరు
ఉదయగిరి రూరల్, మే 2: మండలంలో ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్ తెలిపారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలో 27 లేఅవుట్లలో 953 మంది లబ్ధిదారులు ఉన్నారని, వీరంతా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయగిరి-3 సచివాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది నూరుశాతం బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. అనంతరం అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఖాదర్‌కరీముల్లా, సీఏ ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లేఅవుట్ల పరిశీలన
వరికుంటపాడు : మండలంలోని మహమ్మదాపురంలో జగనన్న లేఅవుట్లను మంగళవారం హౌసింగ్ ఏఈ భాస్కరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేశన స్ధలాలు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.స్థలాలు పొందిన ప్రతి లబ్ధిదారులకు వారికి కేటాయించిన స్ధలాల్లో జియోట్యాగింగ్ చేస్తామన్నారు. పనులు చేపట్టిన వెంటనే విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో వర్క్‌ఇన్‌స్పెక్టర్ నాయబ్‌రసూల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ నాగబాలుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-02T21:55:55+05:30 IST