ఉచితంగా ధ్రువపత్రాల పంపిణీ
ABN, First Publish Date - 2023-07-01T21:41:30+05:30
ప్రతి కుటుంబానికి అవసరమయ్యే ధ్రువపత్రాలను ఉచితంగా ప్రజలకు అందించటమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఓగూరు, కందుకూరు మున్సిపాలిటీ పరిఽధిలోని జనార్దన్‌కాలనీ 1వ సచివాలయంలో శనివారం జగనన్న సుర
కందుకూరు, జూలై 1: ప్రతి కుటుంబానికి అవసరమయ్యే ధ్రువపత్రాలను ఉచితంగా ప్రజలకు అందించటమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఓగూరు, కందుకూరు మున్సిపాలిటీ పరిఽధిలోని జనార్దన్‌కాలనీ 1వ సచివాలయంలో శనివారం జగనన్న సురక్ష ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి సుశీల, జడ్పీటీసీ టీ అనసూయ, ఎంిపీడీవో విజయశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, తహిసీల్దార్ మంజునాథరెడ్డి, ఇంటూరి మాధవరావు, తొట్టెంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
లింగసముద్రం : జగనన్న సురక్షలో భాగంగా మండలంలోని ఎర్రారెడ్డిపాలెం, తిమ్మారెడ్డిపాలెం గ్రామాల్లో వెయ్యి మందికిపైగా ధ్రువపత్రాలు పంపిణీ చేసినట్టు తహసీల్దార్ షేక్ మీరావళి, ఎంపీడీవో యూ శేషుబాబులు చెప్పారు.శనివారం ఈ రెండు సచివాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎర్రారెడ్డిపాలెంలో 543మందికి, తిమ్మారెడ్డిపాలెంలో 540 మందికి ఽధ్రువపత్రాలు పంపిణీ చేసినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు డీ మల్లికార్జున, కే పద్యావతి, వైసీపీ కన్వీనర్ పీ తిరుపతిరెడ్డి, వీ కృష్ణారెడ్డి వీ కొండారెడ్డి, కనకం వెంకటేశ్వర్లు, కే కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వలేటివారిపాలెం : మండలంలోని పోలినేనిచెరువు, అయ్యవారిపల్లె గ్రామ సచివాలయాల్లో శనివారం జగనన్న సురక్ష పథకం కింద జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి భారతి ధ్రువపత్రాలు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక, ఎంపీడీవో రపీక్‌అమ్మద్, తహసీల్దార్ సుందరమ్మ, వైస్ ఎంపీపీ యనమల వరమ్మ, సర్పంచులు డేగా వెంకటేశ్వర్లు, యాళ్ల సుబ్బరాజ్యం, చెన్నిబోయిన ఓబులుకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
అల్లూరు, జూలై 1 : ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అధికారులు, సచివాలయ సిబ్బంది పనిచేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా అల్లూరు సచివాలయం -1లో శనివారం నిర్వహించిన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, ఆర్డీవో శీనానాయక్, తహసీల్దారు చంద్రశేఖర్, కమిషనర్ ఫణికుమార్, కార్యదర్శి వరప్రసాద్, నాయకులు దండా కృష్ణారెడ్డి, నీలం సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బిట్రగుంట : స్థానిక సమస్యల పరిష్కారానికే జగనన్న సురక్షను ప్రవేశ పెట్టారని ఎమ్యెల్యే రామిరెడ్డిప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. బోగోలు పంచాయతీ కార్యాలయ ఆవరణంలో శనివారం ఎంపీడీవో వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష జరిగింది. అనంతరం ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ కీర్తన, సర్పంచులు అనిత, మంజుల, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు వీరరఘు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
కలిగిరి : మండలంలోని పోలంపాడు, చిన అన్నలూరు గ్రామాల్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో ఆర్‌వీ కళాధరరావు, తహసీల్దారు దగ్గుపాటి శ్రీరామకృష్ణ, మండల విస్తరణాధికారి వెలుగోటి మధు, డీటీ మురళీధర్‌రాజు, జెడ్పీటీసీ సభ్యుడు పాలూరి మాల్యాద్రిరెడ్డి, కుడుమలదిన్నెపాడు సొసైటీ ఛైర్మెన్ ములకా శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కావలి రూరల్ : మండలంలోని సిరిపురం, ఆముదాలదిన్నె సచివాలయాల్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సర్పంచులు జక్కంపూడి రమేష్ బాబు, ఊడా బ్రహ్మనందం, ఆర్డీవో శీనానాయక్,జడ్పీటీసీ జంపాని రాఘవులు, ఎంపీపీ ఆలూరు కొండమ్మ, డీఎల్‌పీవో కనకదుర్గ భవాని, ఏఎంసీ చైర్మన్ ఎస్ ప్రసాద్, తహసీల్దార్ మాధవరెడ్డి, ఎమ్పీడీవో ఏవీ. క్రిష్ణమోహన్ పాల్గొన్నారు.
కావలిటౌన్ : మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని సచివాలయంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో 28వార్డు కన్వినర్లు నున్నా మురళీ, అమరా శ్రీనివాసులు, పవిత్రన్, మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, కనపర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-01T21:41:30+05:30 IST