ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: కొత్త అల్లుడికి 108 రకాల వంటలతో విందు..

ABN, First Publish Date - 2023-02-02T11:44:23+05:30

కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాద ఎలా ఉంటాదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో అల్లుడికి ఆ రాచమర్యాదలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు/పొదలకూరు: కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాద ఎలా ఉంటాదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో అల్లుడికి ఆ రాచమర్యాదలు మాములుగా ఉండవు. ఏ పండుగ వచ్చినా అత్తింటివారిలో కొత్త అల్లుళ్లదే హవా ఉంటుందని చెప్పాలి. రకరకాల వంటలు, స్వీట్లతో భోజనం చేసే ప్లే్ట్లును నింపేస్తారు. అయితే.. ఇక్కడ మాత్రం అల్లుడికి కలకాలం గుర్తుండిపోయేలా విందును అత్తింటివారు విందు ఇచ్చారు. కొత్త అల్లుడు ఇంటికి వస్తే రుచికరమైన వంటకాలను వడ్డించడం అందరికి తెలిసిందే.

నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో ఓ కుటుంబం వెరైటీగా అల్లుడికి విందుభోజనం ఏర్పాటు చేసింది. తొలిసారి ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 108 వంటకాలతో విందు భోజనం పెట్టారు. పొదలకూరు మండలంలో ఊసపల్లి వాసి, కండలేరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఉసా శివకుమార్‌, శ్రీదేవి దంపతులు తమ కూతురు శివాని, అల్లుడు ఉమ్మిడిశెట్టి శివకుమార్‌ల కోసం బుధవారం ఈ విందును ఏర్పాటు చేశారు. విందు ఆరగింపును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో చేప, రొయ్యలు, చికెన్, మటన్, శాకాహారం, రసం, సాంబారు, పెరుగు, వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు ఉన్నాయి.

Updated Date - 2023-02-02T11:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising