ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేన్సర్‌పై జాగ్రత్త సుమా!

ABN, First Publish Date - 2023-02-04T23:35:07+05:30

కేన్సర్‌ మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు.

ర్యాలీ పాల్గొన్న కలెక్టర్‌, వైద్యాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవగాహన ర్యాలీలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 4 : కేన్సర్‌ మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ కేన్సర్‌ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం నెల్లూరులోని జీజీహెచ ఆధ్వర్యంలో కేన్సర్‌ అవగాహన ప్రదర్శనను కలెక్టర్‌ ప్రారంభించారు. జీజీహెచ నుంచి కరెంటాఫీస్‌ సెంటర్‌ వరకు సాగిన ప్రదర్శనలో కలెక్టర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జీవన విధానంలో మంచి ఆహారపు అలవాట్లతోపాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ కేన్సర్‌ బారిన పడకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాఽథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. ఆరోగ్యశ్రీలోనూ కేన్సర్‌కు ఉచిత వైద్యసేవలు అంతుతున్నట్లు తెలిపారు. జీజీహెచలో పెన్షనర్లకు, ఈహెచఎ్‌స కింద ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్‌ కేన్సర్‌ ఆసుపత్రిలోనూ రూ.12 కోట్ల విలువైన కేన్సర్‌ వైద్య పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచవో పెంచలయ్య, జీజీహెచ సూపరింటెండెంట్‌ సిద్దానాయక్‌, అదనపు సూపరింటెండెంట్‌ రమే్‌షబాబు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ మురళీకృష్ణ, వైద్యులు కాలేషాసాహెబ్‌, మస్తానబాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising