ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరకొర సిబ్బందితో భూముల రీసర్వే

ABN, First Publish Date - 2023-09-21T21:47:03+05:30

నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేకుండా భూముల రీసర్వే కొనసాగిస్తుండటం సరికాదని, ఇలాగే రీసర్వే జరిగితే రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆందోళన వ్యక్తం

21కెడికె4 : అసెంబ్లీలో మాట్లాడుతున్న మహీధరరెడ్డి

అసెంబ్లీలో మహీధర్‌రెడ్డి ఆందోళన

కందుకూరు, సెప్టెంబరు 21: నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేకుండా భూముల రీసర్వే కొనసాగిస్తుండటం సరికాదని, ఇలాగే రీసర్వే జరిగితే రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులలో గర్భకండ్రికలుగా నమోదై ఉన్న భూముల విషయంలో ఎలా వ్యవహరించాలో రీసర్వే సిబ్బందికి తగిన నిర్దేశం లేదన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా సబ్‌ డివిజన్‌చేసి అక్రమపద్ధతిలో రికార్డుల్లో రైతులపేర్లు నమోదుచేసి ఉన్నారని పేర్కొన్నారు. అనేకప్రాంతాలలో ఎస్సీ, ఎస్టీలకు పట్టాలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమై ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీచేయకుండా రీసర్వే చేశామనిపించుకోవాలన్న ఆలోచనతో హడావిడిగా నిర్వహిస్తే భవిష్యత్తులో తీవ్రమైన భూవివాదాలకు ఆస్కారం కల్పించిన వారమవుతామని ఆయన హెచ్చరించారు. కందుకూరు నియోజకవర్గంలోని సర్వే నెంబరు 116లో 999 ఎకరాల భూమిని ఆ గ్రామరైతులు దశాబ్దాలుగా అనుభవిస్తున్నారని, నేటికీ భూమిపై వారికి హక్కులు కల్పించలేదని పేర్కొన్నారు. మంత్రి మార్గదర్శకాలు ఇచ్చేలా చూడాలని కోరారు.

----------

Updated Date - 2023-09-21T21:47:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising