ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్గి తెగులుతో వరిపైరుకు నష్టం : ఏడీ

ABN, First Publish Date - 2023-02-06T21:24:55+05:30

అగ్గి తెగులును సకాలంలో గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోకుంటే వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని వల్లూరులో సోమవారం వరిపొలాలను ఆయ

వరిపైరును పరిశీలిస్తున్న ఏడీ రాజ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, ఫిబ్రవరి6: అగ్గి తెగులును సకాలంలో గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోకుంటే వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని వల్లూరులో సోమవారం వరిపొలాలను ఆయన పరిశీలించారు. కొన్ని చోట్ల అగ్గితెగులు సోకి ఉండడం గుర్తించి, పలు సూచనలు చేశారు. అగ్గితెగులు నివారణకు ఎకరాకు ట్రైసైక్లోజోల్‌ 120 గ్రాములు, ఐసోప్రోథంలీన్‌ 300 మి.గ్రా లేదా కాసుగామైన్‌ 500మి.గ్రా చొప్పును వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ట్రైసైక్లోజోల్‌కి మ్యాంకోడచ్‌(మెర్జుర్‌) 500 గ్రాములు కలిపి వాడుకోవాలన్నారు. ఆఖరి దశలో ఎకరాకు 10 నుంచి 15 కిలోల ఏంఓపీ వాడితే పైరుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జ్యోత్స్నరాణి, ఏఏబీ జిల్లా కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, మండల చైర్మన్‌ చెంగారెడ్డి, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

పొలంబడిపై అవగాహన

ఇందుకూరుపేట : మండలంలోని లేబూరులో పొలంబడిపై సోమవారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీఏ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులకు సుడోమొనాస్‌ ద్వారా విత్తనశుద్ధి గురించి తెలియజేశారు. ఎంఈఏ రఘునాథరెడ్డి మాట్లాడుతూ అగ్గి తెగులుకు ట్రైసైక్లోజోల్‌ (భీమ్‌) వినియోగించాలని తెలిపారు. అనంతరం ఈ క్రాప్‌ నమోదును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీ సుమలత, టీ యమున, కే తిరుమలరావు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T21:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising