ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

29 నుంచి రొట్టెల పండుగ

ABN, First Publish Date - 2023-07-15T00:11:27+05:30

మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో ఈ నెల 29న ప్రారంభం కానున్న బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగకు భారీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అధికారులకు సూచించారు.

రొట్టెల పండుగపై సమీక్షా సమావేశంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (సాంస్కృతికం), జూలై 14 : మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో ఈ నెల 29న ప్రారంభం కానున్న బారాషహీద్‌ దర్గా రొట్టెల పండుగకు భారీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం బారాషహీద్‌ దర్గాను సందర్శించిన ఆయన రెవెన్యూ, నగర పాలక సంస్థ, పోలీసు అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందస్తు మౌలిక సదుపాయాల కోసం నగర పాలక సంస్థ ద్వారా రూ.2.8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, బారీకేడ్లు, మంచినీరు, వైద్యసదుపాయం, పారిశుధ్యం మెరుగు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన 104, 108 వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. చెరువులో నీరు సమృద్ధిగా ఉండేలా చూడటంతోపాటు గజ ఈతగాళ్లు, సేఫ్టీ బోట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, డీఆర్‌ఓ వెంకటనారాయణమ్మ, ఆర్డీవో మాలోలా, ఆర్‌అండ్‌బీ, కార్పొరేషన్‌ ఎస్‌ఈలు గంగాధర్‌, సంపత్‌కుమార్‌, మత్స్య శాఖ జేడీ నాగేశ్వరరావు, పర్యాటక అధికారి సాయికృష్ణ, విజయా డెయిరీ చైర్మన్‌ రంగారెడ్డి, కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

==========

Updated Date - 2023-07-15T00:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising