ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే నేవీ లక్ష్యం

ABN, First Publish Date - 2023-06-01T05:35:10+05:30

జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు భారత నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● రాష్ట్రపతి అవార్డుల ప్రదాన సభలో నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్‌ హరికుమార్‌

విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు భారత నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ప్రకటించారు. విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో శౌర్య, విశిష్ట, సేవా పతకాలను భారత రాష్ట్రపతి తరపున ఆయన బుధవారం నేవీ అధికారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ భారత నౌకాదళం తన ఆపరేషన్లను ఇంకా విస్తరిస్తుందన్నారు. అంతకు ముందు ఆయన 33 మందికి అవార్డులు అందజేశారు. వినీత్‌కుమార్‌, నిశాంత్‌లకు శౌర్యపతకాలు ప్రదానం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిందుకు మరో 13 మందికి, విశిష్ట సేవా పతకాలు 16 మందికి బహూకరించారు. ఇద్దరికి జీవన రక్ష పతకాలు అందజేశారు. వీటితో పాటు వెపన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో వీకే జైన్‌ మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ను, ఫైర్‌ సేఫ్టీలో రవిధీర్‌ మెమోరియల్‌ గోల్డ్‌మెడల్‌ను ఇచ్చారు. విశాఖ నేవల్‌ డాక్‌యార్డుకు బెస్ట్‌ గ్రీన్‌ ప్రాక్టీస్‌–2023 అవార్డు అందజేశారు.

Updated Date - 2023-06-01T05:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising