అంపాపురంలో అర్ధరాత్రి హైడ్రామా
ABN, First Publish Date - 2023-01-15T03:13:03+05:30
కేసిలో నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చిన బాపులపాడు మండలం అంపాపురంలో బరి వద్ద శనివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.
హనుమాన్ జంక్షన్, రూరల్, జనవరి 14: కేసిలో నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చిన బాపులపాడు మండలం అంపాపురంలో బరి వద్ద శనివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఎస్పీ తనిఖీలకు వస్తున్న సమాచారం నిర్వాహకులకు చేరడంతో లైట్లు ఆర్పివేసి శిబిరాలన్నీ అప్పటికప్పుడు నిలిపివేశారు. శిబిరాలను ఖాళీ చేసేందుకు కొంత సమయం పడుతుందని భావించిన యంత్రాంగం తనిఖీ సమయాన్ని కావాలనే జాప్యం చేసినట్టు తెలుస్తోంది. ఎస్పీ తనిఖీలకు వెళ్లే సరికి అక్కడ కేవలం సంప్రదాయ ఆటలు ఆడుతున్నట్టు నిర్వాహకులు షో చేశారు.
Updated Date - 2023-01-15T03:13:04+05:30 IST