ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాల జిల్లాలో భారీ చోరీ

ABN, First Publish Date - 2023-04-03T02:14:44+05:30

నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామంలోని నాపరాతి పరిశ్రమ యజమాని మల్లు వెంకటేశ్వర్‌ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు అపహరణ

అవుకు, ఏప్రిల్‌ 2: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామంలోని నాపరాతి పరిశ్రమ యజమాని మల్లు వెంకటేశ్వర్‌ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. 80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు దొంగలు అపహరించారు. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరుపతి వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉండడంతో కార్మికులు ఈ విషయాన్ని యజమానికి చెప్పారు. ఇంటికి చేరుకున్న వెంటనే వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు పరిశీలించగా, బీరువాను ధ్వంసం చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి ఇంటిని పరిసరాలను పరిశీలించారు. కొంతమంది అనుమానితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-04-03T02:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising