We are with CBN : మెరుపు నిరసన!
ABN, First Publish Date - 2023-09-15T04:27:33+05:30
‘వుయ్ ఆర్ విత్ సీబీఎన్’ అంటూ హైదరాబాద్‌లో మొదలైన నినాదాల ప్రకంపనలు విజయవాడనూ తాకాయి. చంద్రబాబు అరెస్టుకు ఖండనగా, టీడీపీ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా
చంద్రబాబు అరెస్టుపై మహిళాగ్రహం
విజయవాడలో వెల్లువలా రోడ్డుపైకి..
వాట్సాప్ సందేశాలతోనే కదిలిన యువత
బెంజ్‌సర్కిల్ వద్దకు చేరుకుని ప్రదర్శన
మహిళలు ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గిన పోలీస్
బాబును విడుదల చేయాలని డిమాండ్
విజయవాడ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘వుయ్ ఆర్ విత్ సీబీఎన్’ అంటూ హైదరాబాద్‌లో మొదలైన నినాదాల ప్రకంపనలు విజయవాడనూ తాకాయి. చంద్రబాబు అరెస్టుకు ఖండనగా, టీడీపీ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా గురువారం వేలాదిమంది మహిళలు, విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. మెరుపు నిరసనలతో పోలీసులనే ఆశ్చర్యపరిచారు. వాట్సా్‌పలో సందేశాల ద్వారా ఒక్కొక్కరుగా విజయవాడ బెంజి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, విద్యార్థులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చకితులయ్యారు. వాస్తవానికి ఉద్యమ మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలపాలని వచ్చారు. పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో ట్రెండ్‌సెట్ ముందు ఉన్న సర్వీసు రోడ్డులో నిరసన తెలిపారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సర్వీసు రోడ్డు మొత్తం మహిళలతో నిండిపోయింది. స్కూల్ బస్సుల్లో వెళ్తున్న విద్యార్థులు ‘జై సీబీఎన్’ అంటూ నినాదాలు చేశారు. ట్రెండ్‌సెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐదో నంబర్ రోడ్డు వరకు సాగింది. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు వ్యాన్లను ఏర్పాటు చేశారు. రోప్ పార్టీలను రంగంలోకి దింపారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాలీలో ఎక్కువ సంఖ్యలో మహిళలు, విద్యార్థినులు ఉండడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ర్యాలీలో పాల్గొన్నవారంతా చంద్రబాబు అరెస్టును ఖండించారు. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని, ఊరికొక ‘మెరుపు నిరసన’ చేపడతామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో రేపు భారీ ర్యాలీ
హైదరాబాద్: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయనకు మద్దతుగా హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై భారీ కార్ ర్యాలీకి సన్నాహాలు జరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు 162 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరగనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
Updated Date - 2023-09-15T04:27:33+05:30 IST