ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఆఫీసుకు కోట్ల విలువైన భూమి

ABN, First Publish Date - 2023-02-07T03:53:32+05:30

కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన భారీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఆగ్రహం.. బందరులో నిరసన ప్రదర్శన.. అడ్డుకున్న పోలీసులు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువురి అరెస్టు

మచిలీపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన భారీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ప్రయత్నాలు జరగడంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, కార్యకర్తలు సోమవారం జిల్లా కోర్టు సెంటరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని టీడీపీ నాయకులను ఆ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు ఈడ్చిపడేశారు. కొల్లు రవీంద్ర తదితరులను వ్యాన్‌లో ఎక్కించి గూడూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కొల్లు రవీంద్రను అరెస్టు చేసి రాత్రి 9 గంటలకు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి షరతులపై రవీంద్రను విడుదల చేశారు.

Updated Date - 2023-02-07T03:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising