వైభవంగా ఊయల సేవ
ABN, First Publish Date - 2023-04-15T00:53:22+05:30
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయలసేవను ఘనంగా నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహిస్తున్న అర్చకులు
శ్రీశైలం, ఏప్రిల్ 14: శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహా గణపతి పూజను చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊయలలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు.
అంకాలమ్మకు విశేష పూజలు
శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది. ఈ పూజలలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు.
Updated Date - 2023-04-15T00:53:22+05:30 IST