దొంగ అరెస్టు.. బంగారం వస్తువుల స్వాధీనం
ABN, First Publish Date - 2023-07-21T23:45:12+05:30
మండలంలోని ఎంబాయి గ్రామానికి చెందిన బోయ లక్ష్మ్మ, బోయ రవి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వెంకటేశును బేతంచెర్ల కొత్తబస్టాండులో శుక్రవారం అరెస్టు చేసినట్లు బేతంచెర్ల ఎస్‌ఐ శివశంకర్ నాయక్ తెలిపారు.
బేతంచెర్ల, జూలై 21: మండలంలోని ఎంబాయి గ్రామానికి చెందిన బోయ లక్ష్మ్మ, బోయ రవి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వెంకటేశును బేతంచెర్ల కొత్తబస్టాండులో శుక్రవారం అరెస్టు చేసినట్లు బేతంచెర్ల ఎస్‌ఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఈ నెల 18న బోయ లక్ష్మమ్మ ఇంట్లో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ రూ.50వేలు విలువ చేసే రెండు జతల బంగారు కమ్మలు దొంగలించాడు. రెండు జతల బంగారు కమ్మలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని డోన్ కోర్టులో హాజరుపరచగా.. మెజిస్ర్టేట్ నిందితుడ్ని రిమాండ్‌కు ఆదేశించారని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2023-07-21T23:45:12+05:30 IST