ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

ABN, First Publish Date - 2023-01-26T00:08:36+05:30

యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని... 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు యువతకు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోండి

ఫ కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 25: యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని... 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు యువతకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని యువత ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం యువతకే ఉందన్నారు. మన భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకులను ఎన్నుకోవాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు కోసం ప్రతి భారతీయుడు నమోదు చేసుకోవడం కోసం సమ్మరీ రివిజన కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు గతంలో జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారికి ఓటు నమోదుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు సంవత్సరంలో నాలుగుసార్లు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు నమోదుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో నాసరరెడ్డి, సెట్కూరు సీఈవో పి.వి.రమణ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising