ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీకి సమాధికట్టే రోజులు ఆసన్నమయ్యాయి

ABN, First Publish Date - 2023-09-23T00:21:16+05:30

వైసీపీకి ప్రజలు సమాధి కట్టే రోజులు ఆసన్నమయ్యాయని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

చంద్రబాబు విడుదలయ్యే వరకు పోరాటం

మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 22: వైసీపీకి ప్రజలు సమాధి కట్టే రోజులు ఆసన్నమయ్యాయని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. చంద్ర బాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన సామూహిక దీక్షలు శుక్రవా రంతో 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రకు జనంలో వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే వారిపై అక్రమ కేసు బనాయించారని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి టీడీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారని అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా..అవాంతరాలు ఎదురైనా గట్టిగా నిలబడి పోరాడతా మని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం గురించి ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడారా అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాలు తప్ప అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పదో రోజు దీక్షల్లో టీవీ రామకృష్ణ, బత్తిన సురేష్‌, శాంతిరాజు, బసప్ప, శ్రీనివాసులు, కురువ మల్లయ్య, భీరప్ప, కురువ నరసింహులు, తిమ్మప్ప, కులుమాల రాముడు, రాఘవేంద్ర, మీనాక్షిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి కూర్చున్నారు. దీక్షల్లో పాల్గొన్న నాయ కులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మిగ నూరు టీడీపీ పరిశీలకులు శ్రీరాములు, కౌన్సిలర్లు దయాసాగర్‌, రాందాసు గౌడు, మిఠాయి నరసింహులు, తురేగల్‌ నజీర్‌, సోమేశ్వరరెడ్డి, డీలర్‌ ఈరన్న, కటారి రాజేంద్ర, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ టీ చంద్ర, రమేష్‌, కొండన్నగౌడు, ఈశ్వర్‌, కామార్తి మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising