ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం: బీసీ

ABN, First Publish Date - 2023-09-04T00:08:48+05:30

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఈ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకపోవడం ఖాయమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

గోకులదిన్నెలో కరపత్రాలను అందజేస్తున్న బీసీ జనార్దన్‌ రెడ్డి

అవుకు, సెప్టెంబరు 3: వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, ఈ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకపోవడం ఖాయమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. మండలంలోని గోకులదిన్నె గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న బీసీ జనార్దన్‌ రెడ్డి, బీసీ రామనాఽథరెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను ప్రజలకు అందించారు. బీసీ మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హమీలతో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని, నిబంధనల పేరుతో ప్రజలకు పథకాలను అందకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందిం చారని అన్నారు. నాయకులు బాలిరెడ్డి, బాలతిమ్మారెడ్డి, రామకృష్ణా రెడ్డి, సాంబశివుడు, శ్రీనివాసులు, మధుమోహన్‌ రెడ్డి, మాధవరెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising