వైసీపీని భూస్థాపితం చేయాలి
ABN, First Publish Date - 2023-01-18T00:24:58+05:30
రాబోయే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
ఆత్మకూరు, జనవరి 17: రాబోయే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆత్మకూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఆర్‌టీఎస్ శిక్షణా కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో మాట్లా డారు. వైసీపీ అరాచకాలతో రాష్ట్ర ప్రజలు అవస్థ పడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధిని విస్మరించి కక్షలు, దౌర్జన్యాలు, అరాచకాలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల పథకాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రజాధనంతో పార్టీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే శిల్పా వ్యవహరిస్తున్న దిగజారుడు రాజకీయాలపై విసుగు చెంది త్వరలో చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి రానున్నట్లు వెల్లడించారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఉచిత వైద్యశిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బుడ్డా ప్రారంభించారు. రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్‌హుసేన్, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, నాయకులు బన్నూరు రామలింగారెడ్డి, వెన్నా శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:24:59+05:30 IST