ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుధాన్య ఉత్పత్తిని ప్రోత్సహించాలి - కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-02-02T00:19:38+05:30

పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాల ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన వ్యవసాయాధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన, ఫిబ్రవరి 1 : పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాల ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఈ-క్రాప్‌ బుకింగ్‌, చిరుధాన్యాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించడంపై వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుకు నీటి అవసరం తక్కువ అని, దిగుబడి బాగా ఉంటుందని రైతుల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. రబీ సీజనకు పెండింగ్‌లో ఉన్న 9 శాతం ఈ-క్రాప్‌ బుకింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా పీఎం కిసాన పెండింగ్‌లో ఉన్న 27,024 మంది రైతుల ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఈ సమీక్షలో జేసీ నిశాంతి, జిల్లా వ్యవసాయాధికారి మోహనరావు, డీఎస్‌వో ఆచార్యులు, నంద్యాల ఏడీఏ రాజశేఖర్‌, డోన ఏడీఏ అశోక్‌వర్థనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising