ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు కరెంట్‌ బిల్లుల షాక్‌

ABN, First Publish Date - 2023-06-07T23:37:02+05:30

ఉదయం లేచినప్పటి నుంచి కూలినాలీకి వెళ్లే దినసరి కుటుంబాలు.

విద్యుతచార్జీలు ఎక్కువ వచ్చాయనీ విద్యుత బిల్లులతో నిరసన తెలుపుతున్న కోసిగిలోని రామక్కమ్మవ్వ కాలనీ వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిసెలకు రూ.700 విద్యుత చార్జి

ఆందోళనలో పేదలు

కోసిగి, జూన 7: ఉదయం లేచినప్పటి నుంచి కూలినాలీకి వెళ్లే దినసరి కుటుంబాలు. ఆరు నెలలు సొంత ఊరిలో ఉంటే.. మరో ఆరు నెలలు వలసలు వెళ్లే వలసల జీవితాలు. అలాంటిని వారిని సైతం కరెంట్‌ బిల్లులు షాక్‌ గురి చేస్తున్నాయి. కష్ట జీవులు నివసించే గుడిసెలో టీవీ, రెండు లైట్లు, ఒక ఫ్యాన మాత్రమే ఉన్నా కరెంట్‌ చార్జీలు మాత్రం మోత మోగిస్తున్నాయి. మే నెలకు సంబంధించి రూ.700 విద్యుత బిల్లు రావడంతో సుమారు 50కి పైగా కుటుంబాలు విద్యుత బిల్లులతో రోడ్డెక్కారు. విద్యుత బిల్లులను చూపుతూ కోసిగిలోని 9వ వార్డు రామక్కమ్మ దేవాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రామక్కమ్మవ్వ దేవాలయం కాలనీలో సుమారు వంద కుటుంబాలకు పైగా రేకుల కొట్టాలలో మహిళలు జీవనం సాగిస్తున్నారు. రూ.700 కరెంటు బిల్లు వస్తే.. తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.750 బిల్లు వచ్చింది - గంధాలం నరసమ్మ, 9వ వార్డు, కోసిగి:

మా ఇంట్లో ఒక ఫ్యాన, మూడు లైట్లు, ఒక టీవీ ఉంది. గతంలో రూ.150 కరెంట్‌ బిల్లు వచ్చేది. ఈ నెల రూ.750 కరెంటు బిల్లు వచ్చింది. మేము కూలికి వెళితే గానీ పూట గడవదు. నెల నెలా ఈ విధంగా ఎక్కువగా కరెంటు బిల్లులు వస్తే మేము ఎలా జీవించేది.

రూ.480 వచ్చింది - తమ్మనగేని భీమక్క, 9వ వార్డు, కోసిగి:

గత టీడీపీ ప్రభుత్వంలో మా ఇంటికి కరెంటు బిల్లు రూ.70 వచ్చేది. ఇప్పుడు రూ.480 వచ్చింది. ఈ విధంగా ఎక్కువగా వస్తే ఎలా జీవించేది. మేము వలస కూలీలం. రెక్కాడితే కానీ డొక్కాడదు. విద్యుత బిల్లులు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Updated Date - 2023-06-07T23:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising