ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెరి సగం

ABN, First Publish Date - 2023-03-05T23:40:27+05:30

‘ఉపాధి పనులకు రాకపోయినా పర్వాలేదు. మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాం. డ్రా చేసిన అనంతరం సెరి సగం పంచుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘ఉపాధి’లో మాయజాలం

చేతి వాటం ప్రదర్శిస్తున్న మేటీలు

పనులు చేయకున్నా మస్టర్లలో పేర్లు

ఆ తరువాత డబ్బులు పంచుకుంటున్న వైనం

మద్దికెర, మార్చి 5: ‘ఉపాధి పనులకు రాకపోయినా పర్వాలేదు. మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాం. డ్రా చేసిన అనంతరం సెరి సగం పంచుకుందాం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మేము కూడా ఇచ్చుకోవాలి కదా. ఈ నిబంధనలకు మీరు ఓకే చెబితే మేము ఉపాధి పనుల మస్టర్లలో మీ పేర్లు వేస్తాం’ ఇదీ మండలంలోని పెరవలి, హంప పంచాయతీల పరిధిలో జరుగుతున్న తతంగం. ఈ రెండు గ్రామ పంచాయతీల పరిధిలో మూడు వేల జాబ్‌ కార్డులు ఉన్నాయి. దాదాపు ఆయా గ్రామాల్లో రెండు వేల మంది దాకా పనులకు వెళుతున్నారు. ఇక్కడే ఉపాధి పథకం మేటీలు తమ చేతికి పని పెడుతున్నారు. పనులకు రాని వారి పేర్లను మస్టర్లలో పేర్లు రాసుకొని అవినీతికి పాల్పడుతున్నారు. కొంతమంది గ్రామంలో లేకున్నప్పటికీ ఉపాధి మస్టర్లలో మాత్రం పేర్లు ఉంటున్నాయి. ఈ విషయం మండల స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ నాయకుల ఒత్తిళ్లతో ఏమి చేయలేకపోతున్నారు.

ఒత్తిళ్లతో ఏం చేయలేని పరిస్థితి..

పనులకు రాకున్నా మస్టర్లు వేస్తున్న వైనంపై గతంలో మండల స్థాయి అధికారులు స్పందించారు. మస్టర్లను మద్దికెర కార్యాలయానికి తెచ్చి పనులకు రాని వారికి ఆబ్సెంట్‌ వేసే ప్రయత్నం చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడంతో తిరిగి వాటిని మేటీలకు ఇచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారుల వద్ద నుంచి వెనక్కు తీసుకుని వచ్చిన సంఘటనలు ఉన్నాయి. జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఈ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

జాబ్‌ కార్డులు ఇవ్వాలన్నా..

ఆయా గ్రామాల్లో జాబ్‌కార్డు ఇవ్వాలన్నా సీనియర్‌ మేటీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పైసలు ముట్ట చెప్పాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో జాబ్‌ కార్డుకు రూ.300 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదేమని అడిగేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ తతంగంపై ఎంఈవో రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఎవరైనా లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-03-05T23:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising