ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సర్పంచ్‌కు వందనం

ABN, First Publish Date - 2023-06-07T23:20:13+05:30

అధికార పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా ఓటువేసి గెలిపించిన ప్రజల కోసం సర్పంచ్‌ రామాంజినేయులు పారిశుధ్య కార్మికుడిగా మారి మురికి కాలువలను శుభ్రం చేయడం హర్షించదగ్గ విషయమని, ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

తుగ్గలి సర్పంచ్‌కు సన్మానం చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుగ్గలి, జూన్‌ 7: అధికార పార్టీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా ఓటువేసి గెలిపించిన ప్రజల కోసం సర్పంచ్‌ రామాంజినేయులు పారిశుధ్య కార్మికుడిగా మారి మురికి కాలువలను శుభ్రం చేయడం హర్షించదగ్గ విషయమని, ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం తుగ్గలిలో సర్పంచ్‌ రామాంజినేయులు, ఆయన సతీమణి లక్ష్మీదేవిలను పూలమాలలు, శాలువాలతో ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సర్పంచ్‌ పదవితో గర్వపడకుండా ప్రజలు ఇబ్బందులు పరిష్కరించడానికి తానే మురికి కాలువలను శుభ్రం చేశారని అన్నారు. ఆర్థికసంఘం నిధులను దారి మళ్లించడంతో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో సర్పంచ్‌లు ప్రజలకు ఏమి చేయలేని స్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, సీపీఐ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, సీపీఐ నాయకులు గిడ్డయ్య, నబిరసూల్‌, రాజాసాహెబ్‌, సుల్తాన్‌, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:20:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising