ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్పందన అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-09-26T01:05:54+05:30

స్పందన అర్జీలను పరి ష్కరించాలని కలెక్టర్‌ సృజన అధికారులను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 25: స్పందన అర్జీలను పరి ష్కరించాలని కలెక్టర్‌ సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్యతో కలిసి కలెక్టర్‌ స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్‌ రావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నాగప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు.

కొన్ని వినతులు: సర్వే నెంబరు 394-1లో 20 సెంట్లు పట్టా భూమి ఉందని, పొరపాటున ఆన్‌లైన్‌లో అసైన్డ్‌ భూమిగా నమోదు చేశారని, అలా కాకుండా పట్టా భూమిగా మార్పించాలని జొన్నగిరి మండలం తుగ్గలి గ్రామ నివాసి ఆదినారాయణరెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి గొందిపర్ల, పూలతోట గ్రామాలకు బస్‌ సర్వీసు నడుపుతున్నారని, అయితే ఇందిరమ్మ నగర్‌, సుందరయ్య నగర్‌లకు కూడా బస్సు సర్వీసులు నడపాలని కర్నూలు మండలం గొందిపర్ల గ్రామానికి చెందిన నాగరాజు, తిమ్మారెడ్డి, మోహిద్దీన్‌, రాముడు కోరారు.

Updated Date - 2023-09-26T01:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising