ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాల జనసంద్రం

ABN, First Publish Date - 2023-05-18T00:15:10+05:30

నారా లోకేశ రాకతో నంద్యాల జనసంద్రమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువనేతను చూసేందుకు పోటెత్తిన జనం

భరోసా కల్పిస్తూ నారా లోకేశ పాదయాత్ర

యువగళంలో ప్రజా సమస్యల వెల్లువ

‘సండే’ ఎమ్మెల్యేపై యువనేత ఫైర్‌

నంద్యాల టౌన, మే 17: నారా లోకేశ రాకతో నంద్యాల జనసంద్రమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు. పాదయాత్ర 102వ రోజు బుధవారం సాయంత్రం 4.30గంటల సమయంలో పట్టణ శివార్లలోని మూలమఠం విడిది కేంద్రం నుంచి లోకేశ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చిన్న చెరువుకట్ట, ఆత్మకూరు బస్టాండ్‌, కోటవీధి మీదుగా గాంధీచౌక్‌, కల్పన సెంటర్‌, శ్రీనివాససెంటర్‌, రాజ్‌ థియేటర్‌ వద్దకు 6.45 గంటలకు చేరుకున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎనఎండీ ఫరూక్‌, అసెంబ్లీ ఇనచార్జి భూమా బ్రహ్మానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్‌, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్‌ అహమ్మద్‌ తదితరులు లోకేశ వెంట నడిచారు. రాజ్‌ థియేటర్‌ సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనం భారీగా తరలివచ్చారు. నంద్యాల రూపురేఖలు మార్చింది గత టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. నంద్యాల మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. గాంధీచౌక్‌ నుంచి నూనెపల్లె ప్లైఓవర్‌ వరకు రోడ్ల విస్తరణ టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. బహిరంగ సభ అనంతరం ఎస్‌బీఐ కాలనీ సర్కిల్‌, సాయిబాబానగర్‌ ఆర్చీ, ప్రభుత్వ ఆస్పత్రి, నూనెపల్లె ప్లై ఓవర్‌ మీదుగా రైతునగర్‌ సమీపంలో యాతం ఫంక్షన హాల్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి లోకేశ చేరుకున్నారు.

Updated Date - 2023-05-18T00:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising