ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల బియ్యం పక్కదారి

ABN, First Publish Date - 2023-06-07T00:18:42+05:30

పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులు రేషన కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఎమ్మిగనూరు పట్టణ శివారులో పట్టుకున్న రేషన బియ్యం(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేషన కార్డుదారుల నుంచి సేకరణ

ఇందుకోసం ప్రత్యేకంగా మహిళల కేటాయింపు

కిలో రూ.10 ప్రకారం కొనుగోలు

పాలిష్‌ చేసి సోనా రకాలతో కలిపి తిరిగి విక్రయం

కర్ణాటకకు లారీల్లో పెద్దఎత్తున తరలింపు

చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం

అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

పేదల వద్ద కొన్న రేషన బియ్యం తిరిగి వారి చెంతకే సోనా రకాల పేరుతో చేరుతున్నాయి. వీరి వద్ద కిలో రూ.10కి కొంటున్న వ్యాపారులు తిరిగి పాలిష్‌ చేసి సన్న బియ్యంలో కలుపుతున్నారు. వాటిని తెచ్చి కిలో రూ.60 ప్రకారం అమ్ముతున్నారు. ఈ దందా ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాల్లో జోరుగా సాగుతోంది. కొంతమంది అక్రమార్కులు మహిళలకు కూలి ఇచ్చి రేషన కార్డుదారుల నుంచి బియ్యం సేకరిస్తారు. వాటిని వ్యాపారులు ఓ రహస్య ప్రాంతానికి చేర్చి డంప్‌ చేస్తారు. ఆ తరువాత లారీల్లో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా జోరుగా సాగుతున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యం. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మిగనూరు, జూన 6: పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులు రేషన కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో రేషన బియ్యం దందా యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామాలతోపాటు పట్టణంలో కొంతమంది బృందాలుగా ఏర్పడి రేషన బియ్యం సేకరిస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న కే నాగలాపురం గ్రామ పరిసరాల్లో మూడు సార్లు రేషన బియ్యం పట్టు బడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టుబడినప్పుడు కేసులు నమోదు చేయటం.. ఆ తరువాత వదిలేయటం పరిపాటిగా మారింది. దీనికి తోడు అఽధికార పార్టీ నేతల అండదండలు రేషన బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

ఫమహిళల ద్వారా సేకరణ

బియ్యం సేకరించేందుకు వ్యాపారులు ప్రత్యేకంగా కొంతమంది మహిళలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి రోజు వారి కూలి ఇస్తున్నారు. ప్రధానంగా ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మిపేట, కలుగొట్ల రోడ్డు, కే నాగలాపురం సమీప గ్రామాలు, మంత్రాలయం, తుంగభద్రతోపాటు ఆయా గ్రామాల్లో మహిళ ద్వారా బియం సేకరిస్తున్నారు. వీరు నిత్యం పట్టణం, గ్రామాల్లో తిరుగుతూ బియ్యం సేకరిస్తుంటారు. వీరు సేకరించిన బియ్యాన్ని ఎమ్మిగనూరు, మంత్రాలయం, తుంగభద్ర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఒక చోట నిలువ చేస్తారు. ఆ తరువాత లారీల ద్వారా కర్ణాటకకు తరలిస్తున్నారు. అంతేగాక ఎమ్మిగనూరు పట్టణంలో ఎద్దుల మార్కెట్‌ సమీపంలో ఓ వ్యాపారీ సైతం ఈ దందాను నడుపుతున్నట్లు సమాచారం.

ఫ కాసులు కురిపిస్తున్న రేషన బియ్యం

అక్రమ వ్యాపారులకు రేషన బియ్యం కాసులు కురిపిస్తున్నాయి. బియ్యాన్ని పట్టణం, గ్రామాల్లో కిలో రూ.7 నుంచి రూ. 10కు కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని కర్ణాటకలోని మాన్వి, రాయచూరు ప్రాంతాల్లోని వ్యాపారులకు రూ.13కు విక్రయిస్తున్నారు. ఒక లారీ బియ్యం అక్రమంగా తరలిస్తే దాదాపు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో అక్కడ వ్యాపారులు రేషన బియ్యానికి పాలిష్‌ చేసి సన్న బియ్యంలో కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరిగి వాటిని సోనా బియ్యం రూపంలో జనాలకు అధిక ధర అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ఫ దాడులు అంతంత మాత్రమే..

రేషన బియ్యం అక్రమ రవాణాపై సంబంధిత అధికారుల దాడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని విజిలెన్స ఎండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారే తప్ప స్థానిక అధికారులు పట్టించుకున్నది అరుదుగా చెప్పవచ్చు. దీంతో అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. ప్రతి నెలా పదుల సంఖ్యలో లారీల్లో బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం.

ఫ అధికార పార్టీ నాయకుల అండదండలు

రేషన బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రాలయం నియోజకవర్గం నాయకులు, కొంతమంది అధికారుల సహకారం పూర్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోమంత్రాలయం, పెద్దకడుబూరు మండలాలకు చెందిన వ్యక్తులు నిత్యం రేషన బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాయకుడు సైతం రేషన బియ్యం వ్యాపారం చేస్తు సొమ్ము చేసుకుంటున్నాడు. అలాగే పట్టణంలోని లక్ష్మిపేట ప్రాంతం, ఎద్దుల మార్కెట్‌ ప్రాంతంలో కూడా కొంత మంది రేషన బియ్యం వ్యాపారం సాగిస్తున్నారు. వీరికి కొంతమంది అధికారులు అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫ ఇటీవల కాలంలో అధికారులు దాడులు చేసి పట్టుకున్న రేషన బియ్యం వివరాలు

- ఎమ్మిగనూరు మండలంలోని కే నాగలాపురంలో ఈనెల 6వ తేదీన 92 క్వింటాళ్లు, 15వ తేదీ 226 క్వింటాళ్లు, 17వ తేదీ 70 క్వింటాళ్ల్ల రేషన బియ్యాన్ని విజిలెన్స, పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.

ఫ మండల కేంద్రంలో 20 రోజుల క్రితం 50బస్తాల రేషన బియ్యాన్ని పట్టుకున్నారు.

ఫ మంత్రాలయం మండలంలో గత నెల 14న మాధవరం చెక్‌పోస్టు దగ్గర 30 క్వింటాళ్లు, మంత్రాలయంలో 36 క్వింటాళ్లు రేషన బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

ఫ కౌతాళం మండలం బదినేహాల్‌లో గత నెలలో 12 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

Updated Date - 2023-06-07T00:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising