ఉల్లి భళా..!
ABN, First Publish Date - 2023-10-04T00:34:59+05:30
ఉల్లి ధర రైతులకు ఊరటనిచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు భారీగా విస్తీర్ణం తగ్గిపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిగిలిన పంటల్లాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి పంట సాగు విస్తీర్ణం ప్రస్తుతం బాగా తగ్గిపోయింది.
క్వింటా రూ.2,550
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 3: ఉల్లి ధర రైతులకు ఊరటనిచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు భారీగా విస్తీర్ణం తగ్గిపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిగిలిన పంటల్లాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి పంట సాగు విస్తీర్ణం ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఇదే సమయానికి కర్నూలు మార్కెట్ యార్డుకు రైతులు అమ్మకానికి 10వేల క్వింటాళ్లకు పైగానే ఉల్లి బస్తాలను తీసుకువచ్చారు. మంగళవారం కర్నూలు మార్కెట్ యార్డులో 3,421 క్వింటాళ్ల ఉల్లిని అమ్మకానికి రైతులు తీసుకురాగా, గరిష్టంగా క్వింటం రూ.2,550కు అమ్ముడుపోయింది. మధ్యస్థ ధర రూ.1,810, కనిష్ట ధర రూ.1,155గా రైతులకు దక్కింది. వారం రోజుల క్రితం రూ.2,300లకు మాత్రమే ఉన్న ధర మంగళవారం మరో రూ.250కు పెరిగింది.
Updated Date - 2023-10-04T00:34:59+05:30 IST