పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి
ABN, First Publish Date - 2023-08-22T00:45:08+05:30
పెన్షనర్లకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్‌ఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 21: పెన్షనర్లకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్‌ఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రధాన తపాలా కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లా డుతూ పాత పెన్షన్ ఇచ్చే ప్రభుత్వాలకు భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందన్నారు. పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, ప్రభుత్వం దానిని బరువుగా భావించరా దని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గిరిబాబు, మహ్మద్‌జాని, శివకు మార్‌రెడ్డి, శమంతకరెడ్డి, వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T00:45:08+05:30 IST