చెరువు విధ్వంసం వెనుక ఎవరున్నా వదిలి పెట్టం
ABN, First Publish Date - 2023-08-22T00:42:28+05:30
రాయల నాటి చెరువు ఆక్రమణ, విధ్వంసం వెనుక ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు హెచ్చరించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు
గూడూరు, ఆగస్టు 21: రాయల నాటి చెరువు ఆక్రమణ, విధ్వంసం వెనుక ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు హెచ్చరించారు. సోమవారం గూ డూరు మండలంలోని పెంచికలపాడు గ్రామంలో ఆక్రమణకు గురైన మర్రిమాను చెరువు దగ్గర కె నాగలాపురం సర్పంచ్ నయోమి, టీడీపీ నాయకుడు జె సురేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు చేపట్టిన దీక్షకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నా యుడు, టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్, టీడీపీ అధికార ప్రతినిధి దండు సుంద రరాజు, టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లా డుతూ రాయల నాటి చెరువు గ్రీన్‌కో కంపెనీ ధ్వంసం చేసిన అధికార యంత్రాగం ఏం చేస్తోం దని ప్రశ్నిం చారు. అధిక వర్షాలు వచ్చి చెరువులోకి నీరు వస్తే మూడు గ్రామాలు మునక తప్పదని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేకి కనిపించడం లేదా అని ప్రశ్నిం చారు. ఆకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ చెరువు ఆక్రమణకు గురి కావడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
Updated Date - 2023-08-22T00:42:28+05:30 IST