‘ఎన్‌సీడీసీ రుణాలు మంజూరు చేయాలి’
ABN, First Publish Date - 2023-01-18T00:35:59+05:30
ఎన్‌సీడీసీ రుణాలు 50 శాతం రెండో విడత తక్షణమే మంజూరు చేయాలని షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్, టీడీపీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
కర్నూలు(అగ్రికల్చర్), జనవరి 17: ఎన్‌సీడీసీ రుణాలు 50 శాతం రెండో విడత తక్షణమే మంజూరు చేయాలని షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్, టీడీపీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం షీప్స్ కో ఆపరేటివ్స్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో జిల్లా యూనియన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేడీ రామచంద్రయ్య, డా. శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ పశు నష్టం బీమా పథకాన్ని కొనసాగించి వారికి డబ్బులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డైరె క్టర్లు మురళీమనోహర్, రంగనాథమయ్య, సుబ్బయ్య, పుల్లయ్య, జయరా ముడు, లక్ష్మన్న పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:36:02+05:30 IST