ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిమజ్జనానికిపక్కా ఏర్పాట్లు చేయండి

ABN, First Publish Date - 2023-09-22T23:48:43+05:30

వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్‌ జి. సృజన ఆదేశించారు.

కమిటీ సభ్యులకు కలెక్టర్‌ ఆదేశం

కర్నూలు(అర్బన్‌), సెప్టెంబరు 22: వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్‌ జి. సృజన ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అదనపు ఎస్పీ టి. సర్కార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజతో కలిసి గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఈనెల 26 నిర్వహించే గణేష్‌ నిమ జ్జనంలో అవాంఛనీయ సంఘటనలు జరకుండా పక డ్బందీగా ఏర్పాట్లు ఉండాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న చోట బాధ్యతాయుతంగా నీరు వినియోగించుకో వాలని అన్నారు. తుంగభద్రలో ఇన్‌ఫ్లో లేనందున కేసీ కెనాల్‌కు ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీటినే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అందువల్ల అందుబాటులో ఉన్న నీటి వనరులను వ్యర్థ పరచకుండా, ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూనే, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకో వాలన్నారు. సుంకేసుల బ్యారేజ్‌లో ఒక టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉన్నందున గణేష్‌ నిమజ్జనం కోసం 0.2 టీఎంసీల నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. పోలీస్‌ బందోబస్తు పక్కగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో మధుసూదన్‌రావు, వివిధ శాఖల అధికారులు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉమాపతి, జల వనరుల శాఖ ఎస్‌ఈ రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గణేష్‌ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు మోక్షేశ్వరుడు, ఉపాధ్యక్షుడు హరీష్‌, జిల్లా సమన్యయ కర్త కార్యదర్శి నాగఫణి శాస్త్రి, కోశాఽధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising