ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందీశ్వరునికి రూ. 2.66 కోట్ల ఆదాయం

ABN, First Publish Date - 2023-02-02T23:40:52+05:30

మహానంది క్షేత్రంలో భక్తుల వసతి ఏర్పాట్లు ఏడాది పాటు నిర్వహించుకొనేందుకు బహిరంగ వేలం జరపగా రూ. 2,66,61,598 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, పిబ్రవరి 2: మహానంది క్షేత్రంలో భక్తుల వసతి ఏర్పాట్లు ఏడాది పాటు నిర్వహించుకొనేందుకు బహిరంగ వేలం జరపగా రూ. 2,66,61,598 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆలయం పరిసరాల్లోని పోచా విశ్రాంతి భవనంలో నిర్వహించిన బహిరంగవేలాల్లో కాంట్రాక్టర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. ఇందులో ఏడాది పాటు దేవస్థానం పరిధిలోని వాహనాల టోల్‌గేట్లను వసూలు చేసుకొనే హక్కు ద్వారా రూ. 1.54 కోట్లకు మహానంది మండలం అబ్బీపురానికి చెందిన మనోహార్‌రెడ్డి పాట పాడి దక్కించుకొన్నారు. భక్తుల పాదరక్షలు భద్రపరిచే హక్కును మహానందికి చెందిన మల్లెల సురేష్‌ రూ.13 లక్షలకు, తలనీలాలు పోగు చేసుకొనే హక్కు ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన యాదగిరి రూ. 5.40 లక్షలు, సెల్‌పాయింట్‌ నిర్వహణ లైసన్స హక్కును రూ. 14.50 లక్షలు, అభిషేకపూజ సామగ్రి అమ్ముకొనే హక్కును రూ.59,99,999 మహానందికి చెందిన దేవేంద్రకుమార్‌ దక్కించుకొన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ ద్వారా రూ.12, 35,000, ఆదాయం రాగా మిగిలిన ఆదాయం మహానందీశ్వరుని మాన్యం భూమి కౌలు ద్వారా వచ్చిందని ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన మహేశ్వరరెడ్డి, పాలకమండలి సభ్యులు బుసగాని వెంకటేశ్వర్లు యాదవ్‌, గంగిశెట్టి మల్లికార్జునరావు, దేవదాయశాఖ గ్రూపు దేవాలయాల ఇనస్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T23:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising