టీడీపీకి పూర్వ వైభవం తెద్దాం
ABN, First Publish Date - 2023-09-04T00:15:54+05:30
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెద్దామని పార్టీ కోడుమూరు ఇన్‌చార్జి అకెపోగు ప్రభాకర్ అన్నారు.
కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్
సి.బెళగల్, సెప్టెంబరు 3: తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెద్దామని పార్టీ కోడుమూరు ఇన్‌చార్జి అకెపోగు ప్రభాకర్ అన్నారు. ఆది వారం సి.బెళగల్‌లో టీడీపీ బూత్ కమిటీల సమావేశం టీడీపీ మండల కన్వీనర్ గోవిందుగౌడు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆకెపోగు ప్రభాకర్ మాట్లాడుతూ బూత్ కమిటీలు పోలింగ్ కేంద్రాలలో ఓట్లను పరిశీలించాలన్నారు. అలాగే బోగస్ ఓటర్లు ఉంటే ఆ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లి తొలగించాలన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారెంటీ పోస్టర్‌ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో టీడీపీ కోడుమూరు బీసీ సెల్ నాయకుడు కొండాపురం చిన్న ప్రభు, ఆదిత్యరెడ్డి, అనుమంతుగౌడు, ఆదాం, ఇనగండ్ల నాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-04T00:15:54+05:30 IST