ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ప్రభుత్వం సిగ్గుపడాలి

ABN, First Publish Date - 2023-02-15T01:00:48+05:30

ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు ఇవ్వని జగన్‌ ప్రభుత్వం సిగ్గుపడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

మాట్లాడుతున్న రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

హాలహర్వి, ఫిబ్రవరి 14: ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు ఇవ్వని జగన్‌ ప్రభుత్వం సిగ్గుపడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం గూళ్యం గ్రామంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పనుల గురించి ఆయన మాట్లాడారు. వేదవతి ప్రాజెక్టు ఆలూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాలకు జీవనాడి. ఇందుకు రూ.1942 కోట్లు మంజూరు చేశారు. కానీ ఈ జగన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చారు. హాలహర్వి వద్ద 2 టీఎంసీల జలాశయం నిర్మాణం చేపట్టాలి. భూసేకరణ పనులు సైతం నిలిచి పోయిందని, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని, కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని వెనక్కి వెళ్లిపోతున్నారు. అందువల్ల ఈ ఏడాది 30 నుంచి 40 టీఎంసీల నీరు వృథాగా వెళ్లిపోయాయి. త్వరలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ సమావేశంలో కనీసం రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను సీపీఐ ఆధ్వర్యంలో పర్యటన చేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షేకావత్‌ దృష్టికి తీసుకెళ్తామని, ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, గిడ్డయ్య, భూపేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T01:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising