ఆదిమ మానవుని ఉనికిపై పరిశోధనలు
ABN, First Publish Date - 2023-08-08T23:17:57+05:30
అవుకు పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన ఆవుల అనిల్‌కుమార్ ఆదిమానవుల ఉనికిపై పరిశోధనలు జరిపి గుజరాతలోని అహ్మదాబాద్ పరిశోధనా సంస్థచే ఇంటర్‌నేషనల్ జనరల్ ఆప్ రీసెర్ట్ ఆండ్ అనలటికల్, రివ్యూస్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
అవుకు యువకుడి ప్రతిభకు గుర్తింపు
అవుకు, ఆగస్టు 8 : అవుకు పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన ఆవుల అనిల్‌కుమార్ ఆదిమానవుల ఉనికిపై పరిశోధనలు జరిపి గుజరాతలోని అహ్మదాబాద్ పరిశోధనా సంస్థచే ఇంటర్‌నేషనల్ జనరల్ ఆప్ రీసెర్ట్ ఆండ్ అనలటికల్, రివ్యూస్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఆవుల మద్దిలేటి, విజయకుమారి దంపతుల రెండో కుమారుడు అనిల్ కుమార్ 1న నుంచి 5 వరకు అవుకు మదర్ మోడల్ స్కూల్, 6-10 అవుకు జడ్పీ ఉన్నతపాఠశాలలో చదివారు. 2016-17 పదో తరగతి పరీక్షల్లో 9.7 గ్రేడ్ సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచారు. ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి బీటెక్‌లో సీఎస్‌సీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ప్రాచీన పురాతత్వ ఆదిమానవులపై నలుగురు మిత్రులు పల్లె విజయకుమార్, హరిశ్చంద్రప్రసాద్, అవుల ప్రవీణ్‌కుమార్, ప్రసాద్‌తో కలసి పరిధోనలు సాగిస్తూ వచ్చారు. అవుకు మండలంలోని కునుకుంట్ల గ్రామ పరిధిలోని ఎర్రమల కొండల్లో గుహలు, కొండల్లో 4వేల సంవత్సరాల క్రితమే ఆది మానవులు జీవనం సాగించినట్లు 2300 రాతి చిత్ర ఆనవాళ్లు, 92 గుహల్లో ఆది మానవులు నివసించిన ఆధారాలు సేకరించి పరిశోధనలు జరిపి ప్రాచీన పురాతత్వ శాఖకు పంపారు. 9 ఏళ్ళుగా ఆదిమానవులపై సాగించిన పరిశోధనలకు గత నెల 31నవేదీన పురావస్తుశాఖచే గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని అనిల్‌కుమార్ తెలిపారు.
Updated Date - 2023-08-08T23:17:57+05:30 IST