ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాఠ్యపుస్తకాల తరలింపుపై విచారణ

ABN, First Publish Date - 2023-06-26T00:34:05+05:30

ఆత్మకూరు పట్టణంలో శనివారం రాత్రి పాత పాఠ్యపుస్తకాల తరలింపుపై తలెత్తిన దుమారం నేపథ్యంలో ఆదివారం నంద్యాల డిప్యూటీ డీఈవో మహెబూబ్‌ బేగ్‌ విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, జూన్‌ 25: ఆత్మకూరు పట్టణంలో శనివారం రాత్రి పాత పాఠ్యపుస్తకాల తరలింపుపై తలెత్తిన దుమారం నేపథ్యంలో ఆదివారం నంద్యాల డిప్యూటీ డీఈవో మహెబూబ్‌ బేగ్‌ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ఎంఈవో జానకీరామ్‌ విచారించి వివరాలు సేకరించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరైన పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, ఇతర సామగ్రిని నిల్వ వుంచేందుకు ఆత్మకూరు ఎమ్మార్సీ కేంద్రంలో అనువైన గదులు లేకపోవడంతో నంద్యాల రస్తాలోని జిల్లా పరిషత్‌ ఉర్ధూ పాఠశాలలో గల స్టాక్‌ పాయింట్‌లో నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఇటీవల ఎంఈవో-2 పోస్టు నియామకం జరగడంతో ఎమార్సీ భవనంలో ఆయన ఛాంబర్‌ ఏర్పాటుకై చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మార్సీలోని ఓగదిలో వృధాగా వున్న సిలబస్‌ గడిచిన మూడేళ్ల నాటి పాత పాఠ్యపుస్తకాలకు చెదలు పట్టి తేల్లు, పాములు వస్తుండటంతో భయాందోళనకు గురవుతుండటంతో పాతపాఠ్యపుస్తకాలను జడ్పీఉర్ధూ ఉన్నత పాఠశాల స్టాక్‌ పాయింట్‌ వద్దకు తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. అయితే దీనిపై కొందరు లేనిపోని అసత్య ప్రచారాలు చేశారని, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని ఎంఈవో తన విచరణ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం డిప్యూటీ డీఈవో మహెబూబ్‌ బేగ్‌ ఆత్మకూరు ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది వివరణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అంతకుముందు ఆయన స్టాక్‌ పాయింట్‌లో పాఠ్యపుస్తకాల నిల్వలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated Date - 2023-06-26T00:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising