ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అక్రమ కేసులు ఎత్తివేయాలి’

ABN, First Publish Date - 2023-03-31T00:09:48+05:30

గత ఏడాది జరిగిన జిల్లాల విభజన సందర్భంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ఆందోళనలు చేయటంతో తమపై కేసులు నమోదు చేశారని, వాటిని వెంటనే ఎత్తివేయాలని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు న్యాయవాది తిమ్మప్ప, రాజేష్‌, ఓంకార్‌, ఉదయ్‌, సంజీవ్‌, ఖాధీర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎమ్మిగనూరు, మార్చి 30: గత ఏడాది జరిగిన జిల్లాల విభజన సందర్భంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ఆందోళనలు చేయటంతో తమపై కేసులు నమోదు చేశారని, వాటిని వెంటనే ఎత్తివేయాలని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు న్యాయవాది తిమ్మప్ప, రాజేష్‌, ఓంకార్‌, ఉదయ్‌, సంజీవ్‌, ఖాధీర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. కోనసీమ జిల్లాకు రాజ్యంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని ఆ జిల్లాలోని ఓ సామాజిక వర్గం వ్యతిరేకించి అల్లర్లకు పాల్పడడాన్ని నిరసిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాడు శాంతియుతంగా ఆందోళన చేశామన్నారు. దళితమంత్రి విస్వరూప్‌ ఇంటిపై దాడికి పాల్పడిన 250 మందిపై కేసులు పెట్టారని, నేడు వారిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. ఆందోళన చేసిన వారిపై కేసులు ఎత్తివేస్తున్నప్పుడు, తమపై కూడా కేసులు ఎత్తివేయాలని కోరారు.

Updated Date - 2023-03-31T00:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising