ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ పర్యటనకు భారీ భద్రత - జేసీ, ఎస్పీ

ABN, First Publish Date - 2023-03-25T23:18:51+05:30

రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన భగవత ఆదివారం సంగమేశ్వరం క్షేత్ర పర్యటనకు వస్తున్న దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జేసీ టి.నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నంద్యాల టౌన, మార్చి 25: రాషీ్ట్రయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన భగవత ఆదివారం సంగమేశ్వరం క్షేత్ర పర్యటనకు వస్తున్న దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జేసీ టి.నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన భగవత పర్యటన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, జేసీ మాట్లాడుతూ మోహన భగవత ఆదివారం సంగమేశ్వరం, గోకవరం గ్రామాల్లో పర్యటించనున్నారని అన్నారు. కాన్వాయ్‌ వెంట 10 కండిషన ఉన్న వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణాధికారులను ఆదేశించారు. పర్యటన జరిగే రెండు గ్రామాల్లో అల్పాహారం, భోజనం, తీర్థ ప్రసాదాలు తదితర ఆహార పదార్థాలను ఫుడ్‌ సెప్టీ అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. జనరల్‌ మెడిసిన, జనరల్‌ సర్జన, కార్డియాలజీ తదితర వైద్య నిపుణులతో అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డీసీహెచఎస్‌ అధికారులను ఆదేశించారు. 108 అంబులెన్సలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ పర్యటించే ప్రదేశాల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని డీపీవోను ఆదేశించారు. విద్యుత అంతరాయం లేకుండా నిరంతరంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత శాఖాధికారులను ఆదేశించారు. సంగమేశ్వరం క్షేత్ర సమీపంలో వీవీఐపీల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. సంగమేశ్వర ఆలయంలో సంప్రదాయానుసారం స్వామివార్ల దర్శనాలను శాసో్త్రక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ను ఎస్పీ, జేసీలు ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పుల్లయ్య, డీఎంహెచవో డాక్టర్‌ వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌, జీజీహెచ సూపరింటెండెంట్‌ ప్రసాదరావు తదితర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising