ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
ABN, First Publish Date - 2023-08-30T00:13:45+05:30
స్థానిక సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కర్నూలు(అర్బన్) ఆగస్టు 29: స్థానిక సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసం దర్భంగా గిడుగు రామూర్తి చిత్రపటానికి ప్రిన్సిపాల్ వీవీఎస్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతి థులుగా చంద్రశేఖర్ కల్కూర, జేఎస్‌ఆర్‌కే శర్మ తెలుగు భాషా గొప్పతనాన్ని గేయా, పద్య రూపంలో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాప కులు డి.మల్లయ్య, జి.సునీల్‌కుమార్, ఎం రాజశేఖర్, బంగారు బాబు, గంగఽ దార్, వెంకన్న, వినోలియా, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉస్మానియా కళాశాలలో.. భావ వ్యక్తికరణకు ఏ భాషా అయినా సరిపోతుందని, తెలుగులో ఉండే మాధుర్యాన్ని మరో భాష అందించ లే దని ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రాజావెద్ అన్నారు. మంగళ వారం ఉస్మానియా కళాశాలలో తెలుగుభాషా వారోత్సవాల ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపాల్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమ్మిల్, కళాశాల శాఖాధిపతి. డాక్టర్ మండి అన్వర్ హుసేన్ మాట్లాడారు. విశిష్ట అతిఽఽథులుగా పాల్గొన్న రాయ లసీమ యూనివర్సిటీ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంధం అరుణ, కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ దండే బోయిన పార్వతి, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘబాబు, సాంప్ర దాయ పద్య రచయిత ఎస్‌ఎస్ పటేల్‌ను ఈ సందర్భంగా సన్మానించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్): నగరంలోని శ్రీచైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల ఏజీఎం సురేష్, ప్రముఖ కవి ఎలమర్తి రమణయ్య, తెలుగు ప్రొఫెసర్ డా.అన్వర్ హుశేన్, పాఠశాల ప్రాంతీయ బాధ్యులు వి.వెంకటేశ్, కోఆర్డినేటర్ రమణ పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రమణ, వి.వెం కటేష్, డీన్, వీరయ్య, రంగస్వామి, అయ్యమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కర్నూలు(కల్చరల్): నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగుభాషా దినోత్సవాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కళాక్షేత్రం అధ్య క్షుడు పత్తి ఓబులయ్య అధ్యక్షతన గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన కవన వనంలో గిడుగు రామ్మూర్తిగా ఇనాయతుల్లా, డాక్టర్ సి.నారా యణ రెడ్డిగా ఎస్ మహ్మద్ మియా, కాళ్లకూరి నారాయణ రావుగా పత్తి ఓబు లయ్య, దివాకర్ల తిరుపతి శాస్త్రిగా కే బాలవెంకటేశ్వర్లు, దివాకర్ల వేంకట శాస్త్రిగా శ్రీనివాసరెడ్డి, శ్రీశ్రీగా డాక్టర్ మధుసూదనాచారి, కవయిత్రి మొల్లగా డాక్టర్ కే చంద్రమౌళిని తమ పాత్రల్లో ఆహుతులను మెప్పించారు.
కర్నూలు(రూరల్): ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు ప్రాంతీయ అధికారి కార్యా లయంలో తెలుగుభాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా ఆర్‌ఎం టి.వెంకటరామం హాజరై గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-08-30T00:13:45+05:30 IST