ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ABN, First Publish Date - 2023-09-06T00:12:58+05:30
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన దేశానికి సేవలను కొనియాడారు. అనంతరం సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కర్నూలు(అర్బన్), సెప్టెంబరు 5: నగరంలోని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వ హించారు. ఈసందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఉపకులపతి ఫజులూర్ రహమాన్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. యూనివర్సీటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రాయలసీమ యూనివర్సిటీలో.. భవిష్యత్తు తరాను తీర్చిదిద్దే బాధ్యత గురువులందరిదని ఉపలకులపతి ఆనందరావు అన్నారు. సోమవారం రాయ లసీమ యూనివర్సిటీలో ఉపాధ్యాయ దినోత్సవం సంందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రెక్టార్ సీవీ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో.. ప్రతి గురువు బాధ్యతతో పని చేయాలని క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగో పాల్ అన్నారు. మంగళవారం సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్లస్టర్ యూనివర్సిటీ ఉపకుల పతి ప్రొఫెసర్ సాయి గోపాల్‌ను శాలువతో రిజిస్ట్రార్ శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ వీవీఎస్. కుమార్, అధ్యాపకులు సన్మానించారు. అలాగే కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవానికి క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి డీవీఆర్ సాయి గోపాల్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్): స్థానిక మైఫర్ ఫార్మశీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి డైరెక్టర్ డా.ఆదిమూలపు సతీష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.రవికుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.కాసర్ల సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నత వ్యక్తి అన్నారు. కార్యక్ర మంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో..
కర్నూలు(కల్చరల్): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సహాయ గ్రంథా లయ అధికారి వజ్రాల గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు మగ్బుల్ బాషా, లైబ్రేరియన్లు రేణుక, ఈశ్వరమ్మ, సువర్ణ, ఉమ, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. నగర శివారు జి.పుల్లారెడ్డి నగర్‌లోని అరక్షిత బాలుర పాఠశాల విజ్ఞానపీఠంలో సర్వేపల్లి చిత్రపటానికి కరస్పాండెంట్ పీపీ గురుమూర్తి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆదోనికి చెందిన విశ్రాంత తెలుగు పండిట్ బాలకొం డప్పను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వ్యాస రాజ్, వీహెచ్‌పీ నాయకుడు మహేశ్వర్, ఉపాధ్యాయులు చంద్రమో హన్, రామిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, స్వర్ణలత, సోమయ్య, వంశీరాఘవ, మురళి పాల్గొ న్నారు.
ఓర్వకల్లు: మండలంలోని గుట్టపాడు, నన్నూరు తదితర గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. గుట్టపాడు గ్రామ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి, ఇస్మా యిల్, మండల యువత గ్రామస్థులు సన్మానించారు. అనంతరం విద్యార్థు లకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్, అంగన్ వాడీ టీచర్లు, గ్రామ యువకులు అజయ్, చిన్న, శేషాద్రి, సాయి, రమేష్ పాల్గొన్నారు. అలాగే నన్నూరు గ్రామంలో ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానించారు.
Updated Date - 2023-09-06T00:12:58+05:30 IST