వైభవంగా గద్దెరాళ్ల మారెమ్మవ్వ దేవర
ABN, First Publish Date - 2023-03-16T00:00:37+05:30
రెండేళ్లకొకసారి జరిగే గద్దెరాళ్ల మారెమ్మవ్వ దేవరను పల్లెదొడ్డిలో బుధవారం వైభవంగా నిర్వహించారు.
ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న పల్లెదొడ్డి బోనాలు
దేవనకొండ, మార్చి 15: రెండేళ్లకొకసారి జరిగే గద్దెరాళ్ల మారెమ్మవ్వ దేవరను పల్లెదొడ్డిలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లెదొడ్డి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గ్రామం నుంచి బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి డప్పు వాయిద్యాల నడుమ చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలను సమర్పించి పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారికి పొట్టేళ్లను బలి చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పత్తికొండ డీయస్పీ బందోబస్తులో పాల్గొన్నారు.
Updated Date - 2023-03-16T00:00:37+05:30 IST