ఘనంగా మొదటి పీఠాధిపతి జయంతి
ABN, First Publish Date - 2023-09-22T23:39:27+05:30
అహోబిలం మొదటి పీఠాధిపతి శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ జయంతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
అభిషేకం నిర్వహిస్తున్న వేద పండితులు
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 22: అహోబిలం మొదటి పీఠాధిపతి శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ జయంతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మంగళాసనం, వణ్మఠారి గద్యం పూలవర్షం కురిపించారు. అనంతరం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి అమృతవల్లి అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి శాత్తుమూరై, గోష్టి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T23:39:27+05:30 IST