ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

ABN, First Publish Date - 2023-01-25T00:14:06+05:30

జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన బాలగోవిందరెడ్డి(26) అనే యువరైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూపాడుబంగ్లా, జనవరి 24: జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన బాలగోవిందరెడ్డి(26) అనే యువరైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాత్రి భోజనం చేసి గదిలో పడుకున్న బాలగోవిందరెడ్డి.. మంగళవారం ఉదయం ఎంతసేపటికీ నిద్ర లేవలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆ గది తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అచేతనంగా పడి ఉన్నాడు. చికిత్స కోసం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలగోవిందరెడ్డికి సొంతంగా మూడెకరాలు ఉందని.. 18 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిరప, ఉల్లి పంటలను సాగు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడేళ్ల నుంచి దిగుబడులు రాక రూ.13 లక్షల వరకు అప్పులు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు ఎలా తీర్చాలో తెలియక... మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు నందికొట్కూరు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-25T00:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising