ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

ABN, First Publish Date - 2023-08-22T00:35:51+05:30

రెండురోజుల నుంచి జూపాడుబంగ్లా ఎత్తిపోతల 1, 2 పథకాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రైతులు సోమవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

జూపాడుబంగ్లా, ఆగస్టు 21: రెండురోజుల నుంచి జూపాడుబంగ్లా ఎత్తిపోతల 1, 2 పథకాలకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రైతులు సోమవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్షాలులేక ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయని, మరోవైపు ఎత్తిపోతల ద్వారా నీళ్లు పెట్టుకుని పంటలు బతికించుకుందామనుకుంటే విద్యుత్‌ సరఫరా లేకుండా చేయడం తగదని అన్నారు. విద్యుత్‌ సరఫరా ఇచ్చే వరకు ఆందోళన విరమించేదీ లేదని ఏఈ రామాచారిని చుట్టూముట్టారు. లోడు ఎక్కువగా పడుతోందని పైనుంచి సరఫరా నిలిపేయమని చెప్పారని వివరణ ఇస్తుండగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నీరోజులు లేని లోడు ఇప్పుడే వచ్చిందా అంటూ నిలదీశారు.

పాములపాడు : కరెంటు కోతలు విధిస్తుండటంతో నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పాములపాడు, మిట్టకందాల, చెలిమిళ్ళ, కంబాలపల్లె తదితర గ్రామాల రైతులు సబ్‌స్టేషన్‌ అధికారులు, ఎడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Updated Date - 2023-08-22T00:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising