అహోబిలంలో ఏకాదశి పూజలు
ABN, First Publish Date - 2023-05-31T23:59:19+05:30
అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి వేదపండితులు బుధవారం ఏకాదశి పూజలు చేశారు.
ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేస్తున్న పూజారులు
ఆళ్లగడ్డ, మే 31: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి వేదపండితులు బుధవారం ఏకాదశి పూజలు చేశారు. వేకువజామున్నే వేదపండితులు ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య క్షీరాభిషేకం చేశారు. వేదపండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను గురువారం నిర్వహించడానికి వేదపండితులు అన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-05-31T23:59:19+05:30 IST