ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భయపడం.. పోరు ఆపం

ABN, First Publish Date - 2023-09-15T00:46:22+05:30

టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారని, కేసులకు బయపడేది లేదు.. పోరుబాట వీడేది లేదంటూ టీడీపీ తమ్ముళ్లు భీష్మించారు.

నంద్యాలలో భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి చేపట్టిన దీక్షను భగ్నం చేస్తున్న పోలీసులు

టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారని, కేసులకు బయపడేది లేదు.. పోరుబాట వీడేది లేదంటూ టీడీపీ తమ్ముళ్లు భీష్మించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ‘మేము సైతం బాబుకు అండగా మేమున్నాం’ అంటూ నియోజక, మండల కేంద్రాల్లో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో నిరాహార దీక్ష చేపట్టేందుకు అనుమతులు లేవని పోలీస్‌ అధికారులు, సిబ్బంది దీక్షా శిబిరం వద్దకు భారీగా చేరుకొని జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. తెలుగు యువత, టీడీపీ ప్రజా సంఘాల, మహిళా విభాగాల నాయకులు చంద్రన్నకు అండగా దీక్ష బూనారు. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ మైనార్టీ నాయకులు బస్సులను కడిగి నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం చేపట్టిన దీక్షలకు జనసేన, వామపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. నంద్యాలలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.

సెంట్రల్‌ జైలును ముట్టడిస్తాం

నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు 14 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వరుసగా అక్రమ కేసులు బనాయించి జైలులోనే ఉంచాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని, రాజమండ్రి సెంట్రల్‌ జైలును ముట్టడిస్తామని టీడీపీ యువనాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బాబుకు మేముసైతం అంటూ గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో ఆయన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూడలేక కక్ష సాధింపుతో వైసీపీ వ్యవహరిస్తున్నదని విఖ్యాత్‌రెడి మండిపడ్డారు. ఇదిలా ఉండగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో నిరాహార దీక్ష చేపట్టేందుకు అనుమతులు లేవని వన్‌టౌన్‌, టూటౌన్‌, తాలుకా, త్రీటౌన్‌ పోలీస్‌ అధికారులు, సిబ్బంది దీక్షా శిబిరం వద్దకు భారీగా చేరుకున్నారు. జిల్లాలో పోలీస్‌ 30 యాక్టు అమలులో ఉందని, వెంటనే దీక్షను విరమించాలని పోలీసులు కోరారు. భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి దీక్షను విరమించేది లేదని మొండిపట్టు పట్టడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేశారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ దీక్షా శిబిరం నుంచి టీడీపీ కార్యాలయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ర్యాలీగా వెళ్లారు.

చంద్రబాబు అక్రమ అరె స్టు దుర్మార్గమైనచర్య

జూపాడుబంగ్లా : మచ్చలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడును ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమైనచర్య అని టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌, నంద్యాల పార్లమెంటరీ నాయకుడు గౌరువెంకటరెడ్డి అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో గురువారం జూపాడుబంగ్లాలో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబును విడుదల చేసేవరకు పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. నాయకులు మురళీ, జయసూర్య, వెంకటస్వామి, వెంకటేశ్వర్లుయాదవ్‌, గిరీశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, రామోహ్మన్‌రెడ్డి, రమణారెడ్డి, రవికాంత్‌, రవికుమార్‌యదవ్‌, సుధాకర్‌, బాబు, వీరారెడ్డి, గోరేసాహెబ్‌, ఉస్మాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పతనం ఆరంభమైంది

నంద్యాల (నూనెపల్లె) : రాష్ట్రంలో వైసీపీ పతనం ఆరంభమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణియార్‌ కలీల్‌ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మేము సైతం బాబుకు మేమున్నాం అంటూ నంద్యాలలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. టీడీపీ మహిళా కౌన్సిలర్లు జైనాబీ, శ్రీదేవితో పాటు మహిళా విభాగాలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. టీడీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌, టీడీపీ మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ మాబూలి దీక్షపరులకు నిమ్మరసం అందించి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వామపక్ష అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రింగ్‌ పార్క్‌ రిలే నిరాహార దీక్షలు

శ్రీశైలం: శ్రీశైలం మండలం సుండిపెంటలోని రింగ్‌పార్క్‌ సెంటరు వద్ద గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్‌ అరాచక పాలనకు ప్రజలు అంతం పలకాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. నాయకులు శ్రీనివాసరెడ్డి, రమణ, జెంకె సుబ్బారెడ్డి, మైల శ్రీను, ఉమామహేశ్వరరావు, ఎ. సుబ్బారావు, బెంజిమెన్‌, శారదమ్మ, గంగమ్మ, రజిని పాల్గొన్నారు.

జగన్‌ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు

ఆత్మకూరు : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గరపడ్డాయని శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ కంచర్ల గోవిందరెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆపార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట చేపట్టిన రిలేనిరాహారదీక్షలు గురువారానికి రెండోరోజుకు చేరుకున్నాయి. టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, నాయకులు కలిముల్లా, నాగూర్‌ఖాన్‌, శాఖమూరి గిరిరాజు, వెన్నా శ్రీధర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, దగ్గుపాటి శ్రీనివాసులు, అబ్దుల్లాపురం బాష, తోటగేరి రామసుబ్బయ్య, మల్లికార్జునరెడ్డి, పస్పీల్‌మున్నా, సుబ్బరాజు, షఫి తదితరులు ఉన్నారు.

చంద్రబాబు అరెస్టుపై ఆర్టీసీ బస్సులు కడిగి నిరసన : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌హుసేన్‌ ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులను కడిగి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు ముస్తఫా, ఇస్మాయిల్‌జబివుల్లా, గౌస్‌మాలిక్‌, మనోహర్‌, ఉస్మాన్‌బాష తదితరులు ఉన్నారు.

శివాలయం వద్ద 101 టెంకాయలు కొట్టి మొక్కులు.

పాములపాడు : తమ అధినేత తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల కావాలని మండల తెలుగుయువత అధ్యక్షులు మధుక్రిష్ణ దేవాలయల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. గురువారం పాములపాడులో శివాలయం వద్ద 101 టెంకాయలను కొట్టి భగవంతునికి మొక్కులు చెల్లించారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత శ్రేణులు చంద్రశేఖర్‌, కాశీవిఽశ్వనాద్‌, శివ, మనోహర్‌, నాగరాజ్‌, మద్దిలేటి, మల్లికార్జున, బాబావలి, వీరేష్‌, హరి, రామకృష్ణ పాల్గొన్నారు..

పాణ్యం : టీడీపీ మండల కన్వీనర్‌ గణపం జయరామిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన రెండోరోజు మేము సైతం కార్యక్రమంలో కొనిదేడు, ఆలమూరు గ్రామాలకు చెందిన ఎంపీటీసి రంగరమేష్‌, నాయకులు రాంపుల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరిపాలు, జయమ్మ, శేఖర్‌రెడ్డి, మనోహర్‌, లక్ష్మన్న, బోడెన్న, రాంమోహన్‌నాయుడు, రమణమూర్తి, ఖాదర్‌బాష, సుబ్బయ్య, సుధాకర్‌, వెంకటాద్రి, ఇర్ఫాన్‌, శివశంకర్‌రెడ్డి, మిలిటరీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-15T00:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising