ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీ రేటు పెంచుతూ డీసీసీబీ నిర్ణయం

ABN, First Publish Date - 2023-03-25T23:12:19+05:30

సంవత్సరకాలంగా డిపాజిట్లపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేటును రూ.6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ శనివారం కర్నూలు డీసీసీబీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 25: సంవత్సరకాలంగా డిపాజిట్లపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేటును రూ.6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ శనివారం కర్నూలు డీసీసీబీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. శనివారం కర్నూలులోని డీసీసీబీ బ్యాంకు కాన్ఫరెన్స హాల్లో డైరెక్టర్లు సీఈవో రామాంజినేయులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి చైర్మన మహాలక్ష్మి అధ్యక్షత వహించారు. వడ్డీ శాతాన్ని పెంచడం వల్ల డిపాజిటర్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో తమ డబ్బులను డిపాజిట్‌ చేసేందుకు నమ్మకంతో ముందుకు వస్తారని ఈ సందర్బంగా మహాలక్ష్మి స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో తీసుకుంటున్న సంస్కరణల కారణంగా వ్యాపారం ఘననీయంగా వృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే కర్నూలు కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు నాలుగో స్థానంలో నిలిచిందని అన్నారు. ఇటీవల కాలంలో రైతులకు పంట సాగు కోసం స్వల్ప కాలిక రుణాలు అందించడమే కాకుండా పొలాల అభివృద్ధి కోసం అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, తదితర జీవనోపాధి మార్గాలను పెంచుకునేందుకు దీర్ఘకాలిక రుణాలను కూడా పెద్ద ఎత్తున అందిస్తున్నామని చైర్మన తెలిపారు. అన్ని బ్రాంచులలో ఆరు శాతం వడ్డీకే బంగారు ఆభరణాలను కుదువ పెట్టుకుని రుణాలు అందజేస్తున్నామని, మరోవైపు వాణిజ్య బ్యాంకులతో సమానంగా పొదుపులక్ష్మి మహిళలకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కోసం రుణాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం నంద్యాలలో రీజనల్‌ కార్యాలయం ఏర్పాటు కోసం సొంత భవనాన్ని నిర్మించేందుకు పాలకవర్గం నిర్ణయించింది. కార్యక్రమంలో సీఈవో రామాంజినేయులు, డీసీవో రామాంజనేయులు, బ్యాంకు పర్సన ఇనచార్జి కమిటీ సభ్యులు గుండం సూర్య ప్రకాష్‌ రెడ్డి, వెంకటరమణారెడ్డి, నాసాని వెంకటేశ్వర్లు, సీమ సుధాకర్‌ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, రాఘవేంద్ర, ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ శేషగిరిరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising