అన్ని వర్గాలను మోసగించిన సీఎం
ABN, First Publish Date - 2023-09-26T01:08:14+05:30
ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపిం చారు.
మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కరపత్రాల పంపిణీ
ఎమ్మిగనూరు, సెప్టెంబరు 25: ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపిం చారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన సామూహిక దీక్షలు సోమ వారం 13వ రోజుకు చేరుకున్నాయి. సామూహిక దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే బీవీ పాల్గొన్నారు. అనంతరం మేము సైతం బాబుకోసం అంటూ సోమప్ప సర్కిల్‌లో ప్రజలకు అక్రమ అరెస్టును క్లుప్తంగా వివరించే కరపత్రాలను పం పిణీ చేశారు. బీవీ మాట్లాడుతూ విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోనే గాక దేశ, విదేశాల్లో సైతం ఐటీ ఉద్యోగులతో పాటు సామాన్యులు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తున్నారన్నారు. అక్రమ అరెస్టులతో చంద్రబాబును అడ్డుకోవా లని చూస్తే జగన్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. 13వ రామాం జిని, పురుషోత్తం, హమాలి ఉరుకుందు, కనవీడు పేట డబ్బా ఈరన్న, రాజు, హనుమంతు, ఈరన్నస్వామి, మీనిగ ఈరన్న, పెద్ద రామలింగప్ప, మంగల ప్రభాకర్, వడ్డె కర్రెన్న వీరితో పాటు మరో 26మంది కనకవీడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కూర్చున్నారు. టీడీపీ కౌన్సిలర్లు రాందాసుగౌడు, దయాసాగర్, నాయకులు కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, సుందర్‌రాజు, ముల్లా ఖలీముల్లా, రంగస్వామిగౌడు, రామకృ ష్ణనాయుడు, పార్లపల్లి మల్లికార్జున, కొండన్నగౌడు, డీలర్ ఈరన్న, సోమేశ్వ రరెడ్డి, బాషా, కటారి రాజేంద్ర, దేవదాసు, నరసింహులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-26T01:08:14+05:30 IST