బ్రాహ్మణ సంఘం నేత కన్నుమూత
ABN, First Publish Date - 2023-09-04T00:17:10+05:30
కర్నూలుకు చెందిన బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత, నగర టీడీపీ నాయకుడు సముద్రాల హనుమం తరావు (62) మృతి చెందారు.
కర్నూలు(కల్చరల్), సెప్టెంబరు 3: కర్నూలుకు చెందిన బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత, నగర టీడీపీ నాయకుడు సముద్రాల హనుమం తరావు (62) మృతి చెందారు. ఆదివారం తెల్లవా రుజామున హైదరాబాదులో ఫిలిమ్‌నగర్ అపో లో ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొం దు తూ కన్నుమూశారు. ఆయన పార్దీవ దేహాన్ని హైదరాబాదు నుంచి ఆదివారం మధ్యాహ్నం కర్నూలు ఓల్డ్‌టౌన్ చిన్నమార్కెట్ సమీపంలోని స్వగృహానికి తీసుకువచ్చారు. హనుమంతరావు ఏపీ బ్రా హ్మణ సేవా సంఘ సమాఖ్యలో బ్రాహ్మణ ఆస్తుల అన్యాక్రాంత పరిరక్షణ కమిటీకి రాష్ట్ర చైౖర్మన్‌గా వ్యవహరించేవారు. అలాగే టీడీపీ అధికార ప్రతి నిధిగా నూ పనిచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరే షన్‌కు జిల్లా కోఆర్డినేటర్‌గా పనిచేశారు. హనుమంతరావు పార్దీవ దేహా నికి ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సండేల్ చం ద్రశేఖర్, కంచుగంటల శ్యామ సుందర్ శర్మ, నాగవరం రాజశేఖర్, నాగ రాజుశర్మ నివాళి అర్పించారు. సోమవారం ఉదయం 10 గంటలకు హను మంతరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Updated Date - 2023-09-04T00:17:10+05:30 IST